ఈ రాశివారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు

15 Oct, 2021 06:11 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌: 

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.దశమి రా.8.21 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం శ్రవణం ప.12.35 వరకు, తదుపరి దనిష్ఠ, వర్జ్యం సా.4.31 నుండి 6.04 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.03 వరకు తదుపరి ప.12.10 నుండి 12.57 వరకు, అమృతఘడియలు... రా.1.50 నుండి 3.24 వరకు, విజయదశమి.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం     :  5.37
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు: 
మేషం:  ధనవ్యయం.  శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.  అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. 

వృషభం: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.  బంధువుల తోడ్పాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల: ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: ఆహ్వానాలు అందుతాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. 

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మకరం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. 

కుంభం:  బంధువుల కలయిక. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం:  ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

మరిన్ని వార్తలు