Daily Horoscope: ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. పరిస్థితులు అనుకూలిస్తాయి

17 Jan, 2022 06:01 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి పౌర్ణమి తె.4.29 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం పునర్వసు తె.4.19 వరకు(తెల్లవారితే మంగళవారం) తదుపరి పుష్యమి, వర్జ్యం ప.3.11 నుండి 4.56 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.43 నుండి 3.29 వరకు, అమృతఘడియలు..రా.1.40 నుండి 3.22 వరకు, ముక్కనుమ. 

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు
 

మేషం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

వృషభం: నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనాలు కొంటారు.

కర్కాటకం: నిర్ణయాలలో మార్పులు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. దైవదర్శనాలు.

తుల: పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చర్చలు సఫలం. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు.బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్న సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి.

మరిన్ని వార్తలు