ఈ రాశి వారు ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు

17 Nov, 2021 06:12 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.త్రయోదశి ఉ.9.53 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం అశ్వని రా.11.20 వరకు, తదుపరి భరణి వర్జ్యం రా.7.03 నుండి 8.45 వరకు దుర్ముహూర్తం ప.11.23 నుండి 12.06 వరకు అమృతఘడియలు... ప.3.34 నుండి 4.54 వరకు.

సూర్యోదయం :   6.09
సూర్యాస్తమయం :  5.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం... పనులో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం... పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కర్కాటకం... బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య.... సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల... వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. దైవదర్శనాలు.

ధనుస్సు.... కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువుల కలయిక. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం...  పనులలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో కొత్త సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం... కొత్త పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం.... పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మరిన్ని వార్తలు