ఈ రాశి ఉద్యోగాలలో కొత్త సమస్యలు

18 Aug, 2021 06:31 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు. ఏకాదశి రా.12.14 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం మూల రా.12.18 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.9.20 నుండి 10.48 వరకు దుర్ముహూర్తం ప.11.39 నుండి 12.29 వరకు అమృతఘడియలు... సా.6.17 నుండి 7.46 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:
మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం...  పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం...  కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కర్కాటకం...  శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం....  పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య..  ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

తుల...  పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం...  కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు...  ఇంటిలో శుభకార్యాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.

మకరం...  వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కుంభం....  కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మీనం....    కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మరిన్ని వార్తలు