ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు

18 Sep, 2021 06:00 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.ద్వాదశి ఉ.6.58 వరకు, తదుపరి త్రయోదశి తె.5.53 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం ధనిష్ఠ తె.4.21 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి శతభిషం, వర్జ్యం ఉ.8.44 నుండి 10.20 వరకు, దుర్ముహూర్తం ఉ.5.53 నుండి 7.27 వరకు
అమృతఘడియలు... సా.6.09 నుండి 7.41 వరకు, శనిత్రయోదశి.

సూర్యోదయం :  5.51
సూర్యాస్తమయం :  6.00
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం.. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మిథునం....  కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.  పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొంత  నిరాశ. ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం...  చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయం. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు  కలిసివస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు.

సింహం....  పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. గృహయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కన్య.... మిత్రులతో కలహాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

తుల.... పరిస్థితులు అనుకూలించవు. అనుకోని ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు  నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమార్పులు.

వృశ్చికం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు...  ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం.

మకరం..  పనుల్లో పురోగతి. కుటుంబసమస్యల పరిష్కారం. శుభకార్యాలలో  పాల్గొంటారు. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం..  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం....  మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగమార్పులు.

మరిన్ని వార్తలు