Daily Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో కొత్త ఆశలు..

21 Jan, 2022 06:11 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.తదియ ఉ.7.40 వరకు, తదుపరి చవితి, నక్షత్రం మఖ ఉ.8.57 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం సా.5.10 నుండి 6.46 వరకు దుర్ముహూర్తం ఉ.8.50 నుండి 9.34 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.18 వరకు, అమృతఘడియలు... ఉ.6.29 నుండి 8.08 వరకు తిరిగి రా.2.56 నుండి 4.34 వరకు, సంకటహర చతుర్ధి.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం     :  5.44
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు
 

మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సుహపరుస్తుంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవచింతన.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కీలక నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు.  కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు.  వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. ధననష్టం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు. 

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో  విజయం. శుభవర్తమానాలు. ధనలాభం. కొత్త్వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు.

మీనం: పరపతి పెరుగుతుంది. మిత్రుల  నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

>
మరిన్ని వార్తలు