Today Horoscope: ఈ రాశివారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు.. కుటుంబంలో ఒత్తిడులు

21 Apr, 2022 06:16 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.పంచమి ప.2.45 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం మూల రా.1.22 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.10.26 నుండి 11.55 వరకు, తిరిగి రా.11.53 నుండి 1.22 వరకు దుర్ముహూర్తం ఉ.9.54 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు... ఉ.8.58 నుండి 10.34 వరకు.

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మిథునం: శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కీలక నిర్ణయాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. భూములు కొంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చిక్కులు. ధనవ్యయం.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

కుంభం: నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మరిన్ని వార్తలు