ఈ రాశి వారికి వ్యవహారాలలో ఆటంకాలు

21 Nov, 2021 06:40 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, తిథి బ.విదియ సా.5.05 వరకు, తదుపరి తదియ నక్షత్రం రోహిణి ఉ.6.13 వరకు  తదుపరి మృగశిర, వర్జ్యం ప.12.27 నుండి 2.13 వరకు, దుర్ముహూర్తం సా. 3.51 నుండి 4.34 వరకు, అమృతఘడియలు... రా.11.06 నుండి 12.43 వరకు, సింధునది పుష్కరాలు ప్రారంభం.

సూర్యోదయం       :  6.11
సూర్యాస్తమయం  :  5.20
రాహుకాలం           :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం         :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం...కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల నుంచి పిలుపు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం...వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం...సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

సింహం...వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య..శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
తుల...వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవచింతన.

వృశ్చికం...చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు...వ్యవహారాలలో పురోగతి. ఆస్తి, ధనలాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.

మకరం...వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు అధికమవుతాయి. కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం...సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం...వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. విందువినోదాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మరిన్ని వార్తలు