ఈ రాశి వారికి నూతన పరిచయాలు.. సంఘంలో గౌరవం..

21 Dec, 2021 05:58 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.విదియ ప.12.40 వరకు, తదుపరి తదియ,నక్షత్రం పునర్వసు రా.8.54 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం ఉ.7.45 నుండి 9.29 వరకు, తిరిగి తె.5.28 నుండి 7.12 వరకు (తెల్లవారితే బుధవారం) దుర్ముహూర్తం ఉ.8.39 నుండి 9.23 వరకు, తిరిగి రా.10.38 నుండి 11.30 వరకు, అమృతఘడియలు... సా.6.14 నుండి 8.01 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు సానుకూలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కన్య: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా ఉంటాయి.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి.

మకరం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. ముఖ్య నిర్ణయాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం: సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. కొన్ని పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: ముఖ్య పనులు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు