ఈ రాశి వారు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు

23 Oct, 2021 06:31 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.తదియ రా.12.14 వరకు, తదుపరి చవితి, నక్షత్రం కృత్తిక రా.8.30 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం ఉ.7.18 నుండి 9.04 వరకు, దుర్ముహూర్తం ఉ.5.59 నుండి 7.31 వరకు, అమృతఘడియలు... సా.5.53 నుండి 7.35 వరకు, అట్ల తదియ.

సూర్యోదయం :    5.58
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం....ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. 

వృషభం...నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం....వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కర్కాటకం...ఆకస్మిక ధన, వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం...శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య....మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

తుల...పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం..దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

ధనుస్సు....కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మకరం....పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం.....రుణాలు చేస్తారు. ఆలోచనలు  నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పనులు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

మీనం...పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 

మరిన్ని వార్తలు