ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..

23 Nov, 2021 06:10 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.చవితి రా.9.01 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఆరుద్ర ఉ.11.20 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం రా.12.21 నుండి 2.06 వరకు, దుర్ముహూర్తం ఉ.8.24 నుండి 9.09 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.21 వరకు అమృతఘడియలు... లేవు, సంకటహర చతుర్ధి.

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి లబ్ధి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మకరం: కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు