Today Horoscope: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. బంధువులు, మిత్రులతో విభేదాలు

24 Mar, 2022 06:07 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రా.7.02 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.2.27 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం ఉ.10.03 నుండి 10.54 వరకు తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు అమృతఘడియలు... ఉ.10.50 నుండి 12.19 వరకు.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగలాభం. స్థిరాస్తి విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలం.

మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం: ఇంటాబయటా సమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: కొత్త వ్యక్తులు పరిచయం. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. కళాకారులకు అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం: రుణభారాలు తగ్గుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొన్ని చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో
గందరగోళం నుంచి బయటపడతారు.

కుంభం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఉత్సాహం.

మీనం: అనుకున్న పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో  కొత్త ఇబ్బందులు.

మరిన్ని వార్తలు