ఈ రాశివారికి ఆలోచనలు నిలకడగా ఉండవు

24 Aug, 2021 06:30 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.విదియ సా.4.20 వరకు, తదుపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర రా.9.10 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం లేదు, దుర్ముహూర్తం ఉ.8.18 నుండి 9.06 వరకు తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు అమృతఘడియలు ప.12.56 నుండి 2.34 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం...  సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం....  చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం...  ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

కర్కాటకం...  వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం...  పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూలాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది.

కన్య... రుణాలు తీరే సమయం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

తుల....  పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృశ్చికం....  మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

ధనుస్సు...  కొత్త మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్నరీతిలో సాగుతాయి.

మకరం...  కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కుంభం...  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆసక్తికర సమాచారం. దైవదర్శనాలు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆధిపత్యం మీదే.

మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మరిన్ని వార్తలు