ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

24 Sep, 2021 06:17 IST|Sakshi

శ్రీ  ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.తదియ ఉ.7.01 వరకు, తదుపరి చవితి నక్షత్రం అశ్వని ఉ.8.43 వరకు, తదుపరి భరణి, వర్జ్యం రా.7.11 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.05 వరకు తదుపరి ప.12.17 నుండి 1.04 వరకు, అమృతఘడియలు... తె.5.43 నుండి ఉ.7.23 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం :  5.54
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు:

మేషం.... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.  ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం... కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం.... ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు.

కర్కాటకం... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. 

సింహం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య... చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. .

తుల..... ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కొన్ని పనులు  వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం..... కుటుంబంలో ఉత్సాహం. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.

ధనుస్సు... ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు .

మకరం... కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా సాగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తిలాభం. 

కుంభం... రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరం.

మీనం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మరిన్ని వార్తలు