ఈ రాశివారు అప్పులు చేస్తారు

25 Aug, 2021 06:27 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.తదియ సా.4.20 వరకు తదుపరి చవితి, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.10.11 వరకు తదుపరి రేవతి, వర్జ్యం ఉ.7.10 నుండి 8.50 వరకు దుర్ముహూర్తం ప.11.36 నుండి 12.28 వరకు అమృతఘడియలు... సా.5.06 నుండి  6.47 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం....  ఆదాయం తగ్గుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలు మందగిస్తాయి. శారీరక రుగ్మతలు. ఖర్చులు. మానసిక అశాంతి.

వృషభం...  నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆలయాల దర్శనాలు.విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

మిథునం...  ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తిలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు.

కర్కాటకం...  ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం.

సింహం... ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య... కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు విజయవంతంగా పూర్తి. విద్యార్థులకు అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

తుల... చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం..  కుటుంబంలో చికాకులు. లేనిపోని ధనవ్యయం. ఉద్యోగాలు,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడతాయి.

ధనుస్సు...  అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో తగాదాలు.

మకరం... ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని సంఘటనలు. వివాదాల నుంచి బయటపడతారు. ఇంటర్వ్యూలు అందుతాయి.

కుంభం... కార్యక్రమాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

మీనం...   కృషి ఫలిస్తుంది. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. చేస్తారు. బంధువులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు