ఈ రాశివారు పనులలో విజయం సాధిస్తారు..

25 Oct, 2021 06:29 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.పంచమి తె.4.25 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి షష్ఠి, నక్షత్రం మృగశిర రా.1.44 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం ఉ.5.19 నుండి 7.05 వరకు, దుర్ముహూర్తం ప.12.09 నుండి 12.55 వరకు తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు అమృతఘడియలు... ప.3.56 నుండి 5.42 వరకు.

సూర్యోదయం :    5.59
సూర్యాస్తమయం    :  5.31
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు.

వృషభం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. విందువినోదాలు.

ధనుస్సు: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విచిత్రమైన సంఘటనలు.

మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కుంభం.: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు