ఈ రాశివారి ఆలోచనలు స్థిరంగా సాగవు

25 Jul, 2021 06:41 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి బ.పాడ్యమి ఉ.6.34 వరకు, తదుపరి విదియ తె.5.29 వరకు (తెల్లవారితే సోమవారం) నక్షత్రం శ్రవణం ప.1.04 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం సా.5.01 నుండి 6.34 వరకు దుర్ముహూర్తం సా.4.48 నుండి 5.40 వరకు, అమృతఘడియలు... రా.2.26 నుండి 4.02 వరకు.

సూర్యోదయం        :  5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం...  పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గే అవకాశం.

వృషభం...  పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అంచనాలలో పొరపాట్లు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మిథునం...  సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం...  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం...  బంధువుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కన్య...  రుణాలు చేయాల్సిన పరిస్థితి. పనులు ముందుకు సాగవు. కొన్ని నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల...  వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం...  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహాయం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు...  రుణయత్నాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరం....  శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం...  వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం....  అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. అనుకోని ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మరిన్ని వార్తలు