Daily Horoscope: ఈ రాశి వారికి ఇంటాబయటా ప్రోత్సాహం.. ధన, వస్తులాభాలు

26 Jan, 2022 06:08 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.నవమి రా.1.09 వరకు, తదుపరి దశమి, నక్షత్రం స్వాతి ఉ.7.23 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం ప.12.39 నుండి 2.09 వరకు దుర్ముహూర్తం ప.11.49 నుండి 12.34 వరకు అమృతఘడియలు... ఉ.10.01 నుండి 11.35 వరకు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.51
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. బంధువుల నుంచి సాయం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు.  దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.

ధనుస్సు: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కొన్ని చర్చలు సఫలం. విద్యార్థులకు ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలతో సతమతమవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. దైవదర్శనాలు.

మరిన్ని వార్తలు