ఈ రాశివారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

26 Aug, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.చవితి సా.5.19 వరకు, తదుపరి పంచమి నక్షత్రం రేవతి రా.11.41 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.10.55 నుండి 12.35 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.46 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.46 వరకు అమృతఘడియలు... రా.9.05 నుండి 11.00 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:
మేషం....  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం...  సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

మిథునం...  ఆశ్చర్యకరమైన సంఘటనలు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం... శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం...  బంధువులతో వివాదాలు. అగ్రిమెంట్లు వాయిదా. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

కన్య....  సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల...  శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.

వృశ్చికం...  పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ధనుస్సు....  పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం...  వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కుంభం....  పనులు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం...  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు