ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది

27 Oct, 2021 06:20 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.షష్ఠి ఉ.6.21 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం పునర్వసు పూర్తి (24గంటలు) వర్జ్యం సా.5.11 నుండి 6.54 వరకు దుర్ముహూర్తం ప.11.20 నుండి 12.07 వరకు అమృతఘడియలు... రా.3.37 నుండి 5.22 వరకు.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  5.29
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్య సూచనలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మకరం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: పనులలో అవరోధాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి

మరిన్ని వార్తలు