ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు..

27 Nov, 2021 06:17 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.అష్టమి రా.12.11 వరకు, తదుపరి నవమి, నక్షత్రం మఖ సా.5.22 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం రా.1.27 నుండి 3.04 వరకు దుర్ముహూర్తం ఉ.6.14 నుండి 7.44 వరకు అమృతఘడియలు... ప.2.54 నుండి 4.30 వరకు.

సూర్యోదయం :    6.15
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: ఆకస్మిక ధనలాభాలు. పోగొట్టుకున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దైవదర్శనాలు. ధన లబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన  వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మరిన్ని వార్తలు