ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగాలలో ఊహించిన మార్పులు..

28 Mar, 2022 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.ఏకాదశి సా.4.33 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం శ్రవణం ప.12.48 వరకు, తదుపరి ధనిష్ఠ వర్జ్యం సా.4.37 నుండి 6.10 వరకు, దుర్ముహూర్తం ప.12.27 నుండి 1.16 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు అమృతఘడియలు... రా.1.47 నుండి 3.20 వరకు.

సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశిఫలాలు..

మేషం: పనులు మరింత చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బందిలేకుండా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

కన్య: రుణభారం. ముఖ్య వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దూర్రప్రయాణాలు. ఆస్తుల  వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్ల మధ్య సాగుతాయి.

తుల: సన్నిహితులతో కలహాలు. ముఖ్య పనులలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినస్థాయిలో కనిపించవు.

వృశ్చికం: కుటుంబంలో వేడుకల నిర్వహణ. ఆప్తులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించిన మార్పులు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: కొత్త పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: పనుల్లో విజయం. ఆలోచనలు తక్షణం అమలులో పెడడతారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ మాటకు ఎదురుండదు.

మరిన్ని వార్తలు