ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

29 Aug, 2021 06:33 IST|Sakshi

శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం,  వర్ష ఋతువు, శ్రావణ మాసం,తిథి బ.సప్తమి రా.10.02 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం కృత్తిక పూర్తి (24గంటలు) వర్జ్యం సా.5.09 నుండి 6.54 వరకు దుర్ముహూర్తం సా.4.34 నుండి 5.24 వరకు అమృతఘడియలు...రా.3.42 నుండి 5.30 వరకు

సూర్యోదయం        :  5.48
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  
సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు:

మేషం...  ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కలిసిరావు.

మిథునం...  యత్నకార్యసిద్ధి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కర్కాటకం...  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో విజయం. శుభవార్తలు. విందువినోదాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం....  కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య....  వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తుల..  అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృశ్చికం...  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు...  శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతగా కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి కాగలవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మకరం...  వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

కుంభం...  పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం...  పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు