ఈ రాశి వారు కీలక సమాచారం అందుకుంటారు

29 Nov, 2021 06:03 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి బ.దశమి రా.11.05 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం ఉత్తర సా.5.33 వరకు తదుపరి హస్త,వర్జ్యం రా.1.45 నుండి 3.20 వరకు దుర్ముహూర్తం ప.12.11 నుండి 12.53 వరకు తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు అమృతఘడియలు...ఉ.10.23 నుండి 12.01 వరకు.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: ముఖ్య వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: పనులలో పురోగతి. ఆశ్చర్యకరమైన సంఘటన. ఆధ్యాత్మిక చింతన. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: సన్నిహితుల నుంచి ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కుంభం: సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తి లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

మరిన్ని వార్తలు