ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం

29 Dec, 2021 06:04 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం,ల హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.దశమి ఉ.11.42 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి రా.11.10 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ఉ.5.38 నుండి 7.06 వరకు, తిరిగి తె.4.24 నుండి 5.54 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.41 నుండి 12.23 వరకు, అమృతఘడియలు... ప.2.44 నుండి 4.12 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

వృషభం: బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

కర్కాటకం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కష్టానికి ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

సింహం: యత్నకార్యసిద్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. రుణదాతల ఒత్తిడులు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు డీలాపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: శుభవర్తమానాలు అందుకుంటారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి సహాయం. ఆకస్మిక ధనలబ్ధి. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు