ఈ రాశివారు ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు

30 Aug, 2021 06:21 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి బ.అష్టమి రా.12.02 వరకు, తదుపరి నవమి నక్షత్రం కృత్తిక ఉ.6.24 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం రా.12.07 నుండి 1.55 వరకు, దుర్ముహూర్తం ప.12.24 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు అమృతఘడియలు... తె.5.25 నుండి 7.13 వరకు (తెల్లవారితే మంగళవారం), శ్రీకృష్ణ జన్మాష్టమి.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి

వృషభం: వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో వైరం. దూరప్రయాణాలు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు.  చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: పరిస్థితులు అంతగా కలిసిరావు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.

తుల: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం:  బంధువర్గం నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభం. కార్యజయం. వ్యాపార విస్తృతి. ఉద్యోగాలలో ఉన్నతి.

ధనుస్సు:  సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

మకరం:  కొన్ని పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం:  ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త గందరగోళంగా ఉంటాయి.

మీనం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తలు వింటారు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు