ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

30 Oct, 2021 06:18 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.నవమి ఉ.9.35 వరకు తదుపరి దశమి, నక్షత్రం ఆశ్లేష ఉ.9.07 వరకు, తదుపరి మఖ వర్జ్యం రా.9.27 నుండి 11.06 వరకు దుర్ముహూర్తం ఉ.6.02 నుండి 7.33 వరకు అమృతఘడియలు... ఉ.7.25 నుండి 9.05 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు శ్రమపడాల్సిన పరిస్థితి.

వృషభం: బంధువులతో వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మిథునం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు పనిభారం

కర్కాటకం: నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

సింహం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు.  వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులపై అదనపు బాధ్యతలు. 

కన్య: మీ కష్టం ఫలిస్తుంది. బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

తుల: కొత్త విషయాలు గ్రహిస్తారు.  కాంట్రాక్టర్లకు విశేష లాభం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. 

వృశ్చికం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. ధనవ్యయం.

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

మకరం: మీ సత్తా చాటుకుంటారు. బంధువుల కలయిక. వస్తులాభాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. .

కుంభం: పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్యక్రమాలలో విజయం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మీనం: ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు శ్రమ.

మరిన్ని వార్తలు