ఈ రాశివారికి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది

31 Jul, 2021 06:18 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.సప్తమి ఉ.6.36 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం అశ్వని సా.6.17 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ప.1.57 నుండి 3.41 వరకు, తిరిగి తె.4.50 నుండి 6.35 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం సా.4.47 నుండి 5.38 వరకు, అమృతఘడియలు... ఉ.10.28 నుండి 12.12 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:

మేషం...  పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

వృషభం....  పనుల్లో అవాంతరాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం...  బంధువులతో సత్సంబంధాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం...  కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం...  వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

కన్య....  సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల...  రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం...  దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు.  సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు....  ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో చికాకులు.

మకరం...  వ్యవహారాలలో ఆటంకాలు. కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం....  పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం....  కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు