ఈ రాశి వారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు

31 Oct, 2021 06:55 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి బ.దశమి ఉ.9.43 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం మఖ ఉ.9.51 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం సా.5.54 నుండి 7.31 వరకు, దుర్ముహూర్తం సా.3.54 నుండి 4.40 వరకు అమృతఘడియలు... ఉ.7.22 నుండి 9.03 వరకు.

సూర్యోదయం        :  6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

వృషభం...రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం....ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం...పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం...సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

కన్య..వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆప్తులతో కలహాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం.  వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల....ఆహ్వానాలు రాగలవు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

వృశ్చికం...నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. మానసిక ప్రశాంతత. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు...కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం...శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కుంభం...కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూరతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మీనం...నూతన పరిచయాలు. భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మరిన్ని వార్తలు