ఈ రాశివారికి ఆశాజనకంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, వస్తులాభాలు

10 Jan, 2023 07:37 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం మంగళవారం
సూర్యోదయం 6.38
సూర్యాస్తమయం 5.38
 

తిథి: బ.తదియ ఉ.9.43 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష ఉ.7.20 వరకు తదుపరి మఖ

వర్జ్యం: రా.8.26 నుండి 10.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.32 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.40 వరకు,
అమృతఘడియలు: లేవు.; రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు;
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రాబడి తగ్గుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలువేధిస్తాయి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చిక్కులు. 

మిథునం: అంచనాలు నిజం  చేసుకుంటారు. దేవాలయాల సందర్శనం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. 

కర్కాటకం: దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. చోరభయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు. 

సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆప్తులు దగ్గరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు. 

కన్య: వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విరోధాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

తుల: కృషి ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ప్రముఖుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వాహనయోగం. 

ధనుస్సు: కార్యక్రమాలు ముందుకుసాగవు. రాబడి తగ్గుతుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 

మకరం: కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. బంధువులతో అకారణవైరం. కాంట్రాక్టులు చేజారతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. 

కుంభం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మరిన్ని వార్తలు