వారఫలాలు (13 డిసెంబర్‌‌ నుంచి 19 డిసెంబర్‌ 2020 వరకు)

13 Dec, 2020 07:20 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. కోర్టు వ్యవహారం ఒకటి కొలిక్కి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించే సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. కళారంగం వారికి కార్యసిద్ధి.  వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిరకాల స్వప్నం  నెరవేరుతుంది.  స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.  ఉద్యోగాలలో మీ ఊహలు, అంచనాలు నిజం కాగలవు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. విద్యార్థులకు గతం కంటే మెరుగైన పరిస్థితి.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం.  వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు కొన్ని  పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు నిదానిస్తాయి. ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి, విస్తరణ యత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, నేరేడురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
శుభకార్యాలలో చురుగ్గా  పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంబానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. అలాగే, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి.  వారం చివరిలో çధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో ముందడుగు వేస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో పూర్వవైభవం కనిపిస్తుంది. ఉద్యోగాలలో పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి.  పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహన, గృహయోగాలు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీదారికి తెచ్చుకుంటారు. ఆర్థికంగా మరింత బలపడతారు. రుణబాధలు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. అయితే, ఆరోగ్యవిషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు చిక్కులు వీడతాయి. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు