వారఫలాలు (06 డిసెంబర్‌‌ నుంచి 12 డిసెంబర్‌ 2020 వరకు)

6 Dec, 2020 06:23 IST|Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. సంఘంలో విశేష ఖ్యాతి పొందుతారు. బంధువులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని సందర్భాల్లో చికాకులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త పదవులు దక్కే సూచనలు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. హామీలు నిలుపుకునేందుకు కొంత శ్రమిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. పరిస్థితులు అనుకూలించవు. ఆస్తులు విషయంలో వివాదాలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాయత్నాలు నిదానంగా సాగుతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. మంచి విషయాలు చెప్పినా ఎదుటవారు అపార్థం చేసుకునే వీలున్నందున ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిస్థితులను అనుకూలమైన రీతిలో మార్చుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబంలో మీమాటే అందరూ శిరసావహిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలబాటలో నడుస్తారు. పారిశ్రామికవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అత్యంత కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు పొందుతారు. కళారంగం వారికి  ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా గందరగోళం తొలగుతుంది. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు గతం కంటే మరింత అనుకూలిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. ఆస్తుల వ్యవహారాలలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని సమస్యలు ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. పరిస్థితులు అనుకూలించి కాస్త ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు అత్యంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో చర్చలు జరుపుతారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కోర్టుల్లోని కొన్ని వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ ఆశయాలు నెరవేరతాయి. రాజకీయవర్గాలకు అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని అంచనాలను నిజం చేసుకుంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. మీ సేవానిరతిని అందరూ ప్రశంసిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి. 

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు