ఈ వారంలో ఈ రాశి వారు లక్ష్యాలు సాధిస్తారు

17 Jan, 2021 07:05 IST|Sakshi

వారఫలాలు (17.01.21 నుంచి 23.01.21 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆస్తుల విషయంలో సోదరులతో అవగాహనకు వస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నెలకొన్న సబ్దత తొలగుతుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వివాహయత్నాలలో కొంత వెనుకబాటు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల యత్నాలలో కదలికలు ఉంటాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణయత్నాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు.  ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆశయాలు సాధిస్తారు. ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనుల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి నూతనోత్సాహం, కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. భూముల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో అనుకున్న బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. సోదరులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఎంతగా శ్రమించినా నిరుద్యోగులకు ఫలించదు. ఆరోగ్యం మందగిస్తుంది, కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోస్తారు. కళారంగం వారికి కొత్త చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.  స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పేరు గడిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు