వార ఫలాలు (4 అక్టోబర్‌ నుంచి 10 వరకు)

4 Oct, 2020 06:35 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. చిన్ననాటి మిత్రులను కలుసుని ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో వేధిస్తున్న సమస్యలు తీరతాయి.. పారిశ్రామికరంగం వారికి అనుకూల వాతావరణం.  వారం చివరిలో  అనారోగ్యం. పనులలో ఆటంకాలు. నేరేడు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మరింత అనుకూలత  ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకమైన  విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు వివాదాలు తీరతాయి.. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. సోదరుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధువుల  నుంచి ధనలాభం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా సమస్యలు అధిగమిస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  పనిభారం కొంత తగ్గే అవకాశం. కళారంగం వారికి ఎట్టకేలకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పలుకుపడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. పనులు కొన్ని చివరిలో వాయిదా వేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు కొంత మేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. అత్యంత నేర్పుగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని అంచనాలు నిజం కాగలవు. వారం ప్రారంభంలో సోదరులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో  పైస్థాయి వారితో వివాదాలు సర్దుబాటు కాగలవు.  విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనులలో  అవాంతరాలు తొలగుతాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది.  కోర్టు వ్యవహారాలలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికరంగం వారికి సమస్యల నుంచి విముక్తి.  వారం చివరిలో  ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఉత్సాహంతో ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. సంఘంలో విశేష ఆదరణ  లభిస్తుంది. ఆశించిన రీతిలో డబ్బు అందుతుంది. ఊహించని ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చే సమయం. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి  వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు తీరతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు.  వారం ప్రారంభంలో  స్వల్ప అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సమాజ సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో  ముందడుగు వేస్తారు. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తుల వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయరంగంలోని వారికి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. సంఘంలో మరింత పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కార్యసాధకులవుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికరంగం వారికి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు చేస్తారు. రుణయత్నాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి..కాంట్రాక్టులు చేజారతాయి. ఒక వ్యక్తి ద్వారా మాటపడే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. నూతన పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు