Weekly Horoscope: ఈ రాశుల వారు విజయాలతో దూసుకెళ్తారు

3 Jul, 2022 06:50 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరు మెరుగుపరచుకుని పేరు గడిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు.ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
వారం ప్రారంభంలో కొన్ని సమస్యలతో సతమతమవుతారు. కానీ రానురాను ఈ పరిస్థితి మారి ఉత్సాహంగా గడుపుతారు. అవసరాల మేరకు డబ్బు సమకూరే సూచనలు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారదశకు చేరతాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాలలో పూర్వవైభవం. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్య వ్యవహారాలను రాజీపడకుండా పూర్తి చేస్తారు. విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. గతం గుర్తుకు వచ్చి ఆ విషయాలను మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమించి ముందడుగు వేస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఒక సమస్య పరిష్కారానికి కుస్తీపడతారు.  ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబసభ్యుల వైఖరితో కొంత కలత చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. విద్యావకాశాలు చేజారి విద్యార్థులు నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో పనిభారం. రాజకీయవర్గాల ఆశలు ఫలించవు. వారం మధ్యలో వాహనయోగం. పసుపు, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా నలుగుతున్న గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  నూతన విద్యావకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు ఊరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థికంగా బలోపేతం. రుణభారాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాల్లో లాభాలు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో మీరు అనుకున్నట్లే మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది. భూవివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. కొన్ని వ్యవహారాలలో రాజీలేకుండా ముందుకు సాగుతారు. వాహనయోగం. వ్యాపారాలు మునుపటి కంటే లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను అందరూ గుర్తిస్తారు. కళారంగం వారికి మరింత ఉత్సాహం. అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
దూరపు బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఎంతటి పరిస్థితినైనా చక్కదిద్దుకుని ముందుకు సాగుతారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి.     వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో అనారోగ్యం.  పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొన్ని పనులు ఇతరుల ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తారు. ఎటువంటి పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊపిరి పీల్చుకుంటారు. కళారంగం వారికి విజయాలు వరిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. కుటుంబ సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఎదుటవారి నుండి విమర్శలు ఎదురైనా సహనం పాటించండి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగేందుకు మరింత కృషి చేస్తారు. ఉద్యోగాలలో హోదాలలో మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి శుభవర్తమానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ జీవనపయనం సాగిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకునేందుకు యత్నిస్తారు. వివాహాది శుభకార్యాలపై బంధువులతో చర్చలు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన చేయండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. యుక్తి, సహనంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. అయితే కొంత శ్రమపడాలి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఆప్తులతో కలహాలు. ధనవ్యయం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

మరిన్ని వార్తలు