వారఫలాలు: 9 అక్టోబర్‌ నుంచి 15 అక్టోబర్‌ 2022 వరకు

9 Oct, 2022 06:43 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం సా«ధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ భావాలను తెలియజేస్తారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. గతంలోని కొన్ని సంఘటనలు నెమరు వేసుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  రాజకీయవర్గాలకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వీరికి అన్ని విధాలా అనుకూల సమయం. పట్టుదలతోæ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. పనులు సకాలంలో  పూర్తి చేసేందుకు యత్నిస్తారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మీలో ఉన్న ప్రతిభను చాటుకుంటారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశాంతత. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం మ«ధ్యలో ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ  ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠనం ఉత్తమం. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రుణబాధలు తీరి ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. పట్టుదలతో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు  సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. పనులను అనుకున్న సమయానికి చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం వద్దు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కీలకమైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఖర్చులు తప్పవు. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  దుర్గాదేవిని స్మరించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్యులతో చర్చలు సఫలమవుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో మరిన్ని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి విశేష ఆదరణ.  వారం  ప్రారంభంలో మానసిక ఆందోళన. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.  ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అదనపు రాబడి లభించి ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తులు నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం చాలావరకూ తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు.వారం మధ్యలో లేనిపోని ఖర్చులు. కుటుంబసమస్యలు. లేత పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది తప్పదు. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు  సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తాయి.  విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం చివరిలో శ్రమ తప్పదు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు