Astrological Horoscope: ఈ రాశివారికి అనుకోని ధనవ్యయం...

10 Oct, 2021 06:18 IST|Sakshi

Vara Phalalu : మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  ప్రత్యర్థులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి.  రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.  రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న లక్షా్యలను సాధిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు సమకూర్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధననష్టం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం మధ్యలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురైనా అధిగిస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. సన్నిహితులు వ్యవహారాలలో ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నీలం, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. గతం నుంచి వెంటాడుతున్న కొన్ని సమస్యలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు