Weekly Horoscope: 11 సెప్టెంబర్‌ నుంచి 17 సెప్టెంబర్‌ 2022 వరకు

11 Sep, 2022 07:00 IST|Sakshi

మేషం 
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మరింత అనుకూలిస్తాయి. ఇతరుల సాయం లేకుండానే కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం చివరిలో అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

వృషభం
(కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
గతం నుంచి వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య నుండి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉండి లాభాలు గడిస్తారు. పారిశ్రామికవర్గాలకు  కష్టానికి ఫలితం కనిపించదు. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

మిథునం
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. పరిస్థితులను అనుకూలంగా చక్కబెడతారు. వ్యాపారాలు ఆశించినదాని కంటే అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కేచాన్స్‌. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి సమస్యలు. నీలం, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి సహాయం అందుతుంది. వారం  ప్రారంభంలో ధనవ్యయం.  పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పట్టుదలతో ఏ కార్యక్రమాన్నైనా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడచిపోతుంది. భూములు, వాహనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు వ్యాపారాలు విస్తృతపరుస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. ఖర్చులు అధికమై ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతికి అభిషేకం చేయండి.

కన్య
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రాబడి ఆశాజకనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.  కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

మరిన్ని వార్తలు