వారఫలాలు: 11 డిసెంబర్‌ నుంచి 17 డిసెంబర్‌ 2022 వరకు

11 Dec, 2022 06:57 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు, ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే మీకు రిక్తహస్తాలు చూపుతారు.  ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనూహ్యమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
విద్యార్థులు కొత్త అవకాశాలపై ఎదురుచూస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. గృహం కొనుగోలు ప్రయత్నాలు ముందుకుసాగవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో భూవివాదాలు. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలను నెమరువేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఆలోచనలు ఎట్టకేలకు  కలసివస్తాయి. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో శ్రమ అధికం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో సఫలం చెందుతారు. ఉద్యోగాలలో బాధ్యతల విషయంలో సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు సకాలంలో  చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూముల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు పదవులు లభించే వీలుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలకు వెనుకాడరు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. మనోనిబ్బరంతో ఎటువంటి సమస్యనైనా అధిగమిస్తారు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు అనుకున్నంత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. నలుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు రావచ్చు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు  విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు