ఈ రాశివారికి వారం చివరిలో మిత్రులతో అకారణంగా విరోధాలు

14 Nov, 2021 06:21 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. ప్రముఖులతో పరిచయాలు నూతనోత్సాహాన్నిస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. గోధుమ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులను వేగంగా పూర్తి చేస్తారు.  ఆలోచనలను అమలు చేస్తారు. సంఘంలో  పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
గతం నుంచి ఎదురవుతున్నæ చికాకులు క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యవహారాలు వేగంగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు మరింత పుంజుకుంటాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలను అనుకున్న విధంగా  విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. వ్యయప్రయాసలు.  ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులలో∙జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కివస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి మీకు తోడ్పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మునుపటి కంటే  లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల వారు శుభవార్తలు వింటారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, పసుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి.  విద్యార్థులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి  ఎటువంటి అవసరమైనా తీరుతుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు.  నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం  అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారవచ్చు. ఇంతకాలం ద్వేషించిన వారేæ ప్రశంసిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలకు అవకాశం. సాంకేతికవర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో మిత్రులతో అకారణంగా విరోధాలు. మానసిక ఆందోళన.  పసుపు,  ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలు ∙నెమ్మదించినా  ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో మరింత ప్రగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సమయానికి  విస్తరిస్తారు. ఉద్యోగాలలో సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు.  చాక్లెట్, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విశేష గౌరవమర్యాదలు దక్కుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. కళారంగం వారికి అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం  ప్రారంభంలో  అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. తెలుపు, కాఫీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది రుణబాధలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొంత జాగ్రత్త వహించండి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం, అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మొదట్లో నిరాశ పరచినా అవసరాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. కళారంగం వారి కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబంలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. కీలక సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

మరిన్ని వార్తలు