Weekly Horoscope: వారంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు

15 May, 2022 07:02 IST|Sakshi

మేషం....
దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కొన్ని పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.  కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. రాజకీయవర్గాలు, కళాకారులకు అనుకూల వాతావరణం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం...
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. విందువినోదాలలో పాల్గొంటారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు మరింత సంతోషకరంగా ఉంటుంది.   వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

మిథునం...
ప్రారంభంలో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రావలసిన డబ్బు అంది  అవసరాలు తీరతాయి. ఆప్తులు మరింత దగ్గరకు వస్తారు. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.  వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.  ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉండి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.  వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది.  పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం...
ముఖ్యమైన  పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో విభేదాలు పరిష్కారం. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం...
ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో  ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, పసుపు రంగులు. గణేశ్‌ను పూజించండి. 

కన్య...
పనుల్లో మరింత జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలుæ నెలకొంటాయి.  ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సాయంతో కొంత ముందుకు సాగుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలలో  కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. కళారంగం వారు తమ ప్రయత్నాలు సాధిస్తారు. వారం మధ్యలో శుభకార్యాలకు హాజరవుతారు. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల...
ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు.  ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి  బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. ధనవ్యయం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత అర్చనలు మంచిది.

వృశ్చికం...
విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులలో ప్రతిబంధకాలు తొలగి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ గౌరవం మరింత పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. వాహనాలు, విలువైన ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం చాలావరకూ తగ్గి ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవిస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలున్నాయి.  తండ్రి తరఫు నుంచి కొంత లాభం దక్కవచ్చు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.  ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి.  వారం చివరిలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం...
ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో పేరుప్రతిష్టలు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.  శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు.  కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం...
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల మెప్పు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి ధనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఊహించని లాభాలు. ఉద్యోగ విధుల్లో    ప్రశంసలు పొందుతారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆప్తులు  మీకు సహాయకులుగా నిలుస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మరిన్ని వార్తలు