ఈ రాశివారికి వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు

16 May, 2021 06:30 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థికంగా కొంత నిరాశ కలిగినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న వివాదాలు, ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఇబ్బందికరంగా మారవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలతో కొంత సతమతమవుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు, మానసిక అశాంతి.  వారం  మధ్యలో ఆకస్మిక  ధనలబ్ధి. వాహనయోగం. శుభవార్తలు. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనులు దిగ్విజయంగా సాగుతాయి. శ్రమకు తగినంత ఫలితం పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉండవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కే ఛాన్స్‌. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆప్తులతో విభేదాలు.  గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లలితాదేవి స్తుతి పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యూహాత్మకంగా అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారంలో విజయం మీదే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్నంత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆప్తులు, ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి.  ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకమ్‌ పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలు తీరతాయి. వ్యవహారాలలో æ ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. విద్యార్థులు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. వారం  ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.  గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. మేధా దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక∙రుణాలు కూడా తీరే సమయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. అందరిలోనూ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఆస్తుల క్రయవిక్రయాలలో లక్ష్యాలు నెరవేరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు. వృథా ఖర్చులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసూర్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పొరపాట్లు సరిదిద్దుకుని అనుకున్న వ్యవహారాలు చక్కదిద్దుతారు. శత్రువులను కూడా వశపర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. తరచూ ధనలబ్ధి కలిగే సూచనలు. కొత్త నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో క్రమేపీ మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. పదవీయోగం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని రుణబాధలు తీరతాయి. ఆస్తులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం రాగలదు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ కొలిక్కి వస్తుంది. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు