Weekly Horoscope: 17 జూలై నుంచి 23 జూలై 2022 వరకు

17 Jul, 2022 07:11 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం చివరిలో  స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు. రుణబాధల నుండి విముక్తి. అందరిలోనూ  మరింత గౌరవం లభిస్తుంది.  ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు, ప్రోత్సాహం. వారం మ«ధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుప్రార్థన చేయండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అన్నింటా విజయమే కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు మరింత సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకుని సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కష్టసాధ్యమైనా విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు.  కళారంగం వారికి  అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. స్థిరాస్తి వృద్ధి చేసుకునే యత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అనుమతులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు అనుకోని విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరే సమయం. వారం మధ్యలో ధనవ్యయం. ఆప్తులతో విభేదాలు నెలకొంటాయి. గులాబీ, తెలుపు రంగులు. రాఘవేంద్ర ధ్యానం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం.  దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు సంభవం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. పసుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు క్రమేపీ తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఎవరి ప్రమేయం లేకుండానే విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాల వారి మాటకు ఎదురుండదు. వారం ప్రారంభంలో  వృథా ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  విద్యార్థులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం రావచ్చు. వారం ప్రారంభంలో ఆప్తుల నుండి ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎట్టకేలకు తొలగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత వృద్ధి చెందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబంలో కొత్త సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠనం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం. భూములు, వాహనాలు కొనుగోలు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధనతో ఉపశమనం లభిస్తుంది. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  స్థిరాస్తులు కొన్ని సమకూర్చుకుంటారు. యుక్తిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న విధంగా విధులు మారవచ్చు. రాజకీయవర్గాలు తమ సత్తా చాటుకుని లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

మరిన్ని వార్తలు