ఈ రాశివారికి వారం మధ్యలో ధనలబ్ధి

17 Oct, 2021 06:03 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌: 

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్య పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. గృహæ నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలలో విజయం. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు సమయానికి  పూర్తి చేస్తారు. బంధువులతో కొన్ని విషయాలపై చర్చలు జరుపుతారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల సమయం.  వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉత్సాహంగా కొన్ని పనుల్లో  విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. గృహ నిర్మాణాలలో ముందడుగు పడుతుంది. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం.  తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం.  ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే  మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కారం. ఒక సమాచారం మీలో సంతోషం కలిగిస్తుంది. ఏ పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరుగుతాయి.  పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చకచకా ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ  ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు నిదానంగా సాగినా సకాలంలోనే పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు లభిస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో  సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అందర్నీ ఆకట్టుకుంటారు.  సంఘంలో విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. భూవివాదాల పరిష్కారం. రావలసిన సొమ్ము అందుతుంది. బంధువులతో సమావేశమవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మొదట్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది.  వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న విధంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు, లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. నీలం, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలుస్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి వివాదాలు. నిరుద్యోగులకు కొంత నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై  కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో ధనలబ్ధి. కొత్త ఒప్పందాలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగుచూస్తుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని క్లిష్ట సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపట్టి  శ్రమపడినా పూర్తి చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది.  దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తధ్యం. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.ఆదిత్య హృదయం పఠించండి.

మరిన్ని వార్తలు