Weekly Horoscope: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు

18 Sep, 2022 06:50 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు చాలా అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయ త్నాలు సాగిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. సాంకేతికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం  ప్రారంభంలో ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయా ణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. విద్యార్థులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని వివాదాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. 

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకం. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో మానసిక ఆందోళన. దైవదర్శనాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన చేయండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు.  వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.నీలం, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో  శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

మరిన్ని వార్తలు