Weekly Horoscope Telugu: ఈ రాశి వారు వారం మధ్యలో గుడ్‌ న్యూస్‌ వింటారు

19 Mar, 2023 07:14 IST|Sakshi

మేషం: అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి ఉంటుంది.  ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు.  వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిళ్లు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుప్రార్ధన చేయండి.

వృషభం: అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్యంత ఇష్టులైన వారిని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. చిరకాల మిత్రుల కలయిక. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో  మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మిథునం: ఊహించని రీతిలో  రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సంఘంలో మరింత పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం: ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు నైపుణ్యతను చాటుకుంటారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.  పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక ఆందోళన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహ మహామంత్రం పఠించండి.

సింహం: ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. మిత్రులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన లేఖ సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య: ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలపై కుటుంబసభ్యులను సంప్రదిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం కాగలవు. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.  వారం  ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరాఘవేంద్ర ధ్యానం చేయండి.

తుల: ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వాహనయోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి.  వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేష గుర్తింపు. వారం మధ్యలో  శ్రమ పెరుగుతుంది. అనుకోని ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహాయపడతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పనులు  సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రుల  ద్వారా శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు  మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు అందుతుంది. కొన్ని సమస్యల నుంచి ఓర్పు, నేర్పుగా బయటపడతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.   ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో  విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం: అనుకోని  సంఘటనలు ఎదురవుతాయి. పరిచయాలు పెరుగుతాయి.  ఆప్తుల ద్వారా శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకోని  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో  కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 

కుంభం: కుటుంబసమస్యల నుంచి అధిగమిస్తారు. కొన్ని పనులు కొంత  శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఓర్పు, నేర్పుగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి  ప్రయత్నాలు సఫలం.  వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఒక  కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగుల  యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో  శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మరిన్ని వార్తలు