Weekly Horoscope: 19 జూన్‌ నుంచి 25 జూన్‌ 2022 వరకు

19 Jun, 2022 06:30 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే,  సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.  పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మనస్పర్థలు తీరి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. గృహం కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి.  వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనారోగ్యం.  తెలుపు, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గి  కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటన అవకాశాలు. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం మంచిది.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న పనులు మరింత వేగవంతంగా సాగుతాయి. మీపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభించేందుకు మీకిది అనువైన సమయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మీలో మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఒడ్డునపడతారు. రాజకీయవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. వారం చివరిలో బంధువర్గంతో తగాదాలు ఎదురవు తాయి. అనారోగ్యం.  నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూ వివాదాల ఎట్టకేలకు పరిష్కారం. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణలు సాగిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.  కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి పురస్కారాలు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాల నుండి గట్టెక్కుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో మానసిక ఆందోళన. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకుపచ్చరంగు, లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు  కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మనస్పర్థలు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని   వ్యవహారాలు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహన, గృహయోగం.  నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనుల్లో మరింత అభివృద్ధి ఉంటుంది.  కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో బంధువుల నుండి ఒత్తిడులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం. ఎరుపు, చాక్లెట్‌ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి  కొన్ని సమస్యలు తీరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన.  తెలుపు, చాక్లెట్‌æరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త  పనులకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చేపట్టిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా సానుకూలమైన సమయం. వారం చివరిలో మానసిక వేదన, అనారోగ్య సూచనలు ఎదురవుతాయి. మిత్ర విరోధాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు