ఈ రాశి వారికి వారంలో చిరకాల స్వప్నం నెరవేరుతుంది

19 Sep, 2021 06:36 IST|Sakshi

ఈ వారం రాశిఫలాలు ఫోటో స్టోరిస్‌

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖమైన వ్యవహారాలలో మరింత పురోగతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు.  ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో  చర్చల్లో ప్రతిష్ఠంభన. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ప్రత్యర్థులు కూడా మీపట్ల విధేయత చూపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు. కొంత అస్వస్థత కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగాలలో  కోరుకున్న  హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. మిత్రుల  నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. పలుకుబడి మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు∙అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న విధంగా పనులు పూర్తి కాక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.  పనిఒత్తిడి  పెరుగుతుంది. కళారంగం వారి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో  శుభవార్తలు. కుటుంబంలో సంతోషకర వాతావరణం. విందువినోదాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మధ్యమధ్యలో కొన్ని  సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆస్తుల  కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏదోవిధంగా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది.  వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో∙ప్రతిభ చూపినా నిరాశ తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వారం ప్రారంభంలో వాహనయోగం. నూతన పరిచయాలు. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మనస్సులోని భావాలను పంచుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో విరో«ధాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. నేరేడు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఎటువంటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి, హోదాలు కలిగిన వారు సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. రావలసిన బాకీలు అందుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కొంత ఊరటనిస్తాయి.  ఉద్యోగాలలో మార్పులు తప్పవు.  పారిశ్రామికవర్గాలకు కొన్ని అవకాశాలు రావచ్చు. వారం దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి. 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. పరిచయస్తులే కొన్ని సమస్యలు సృష్టించవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలించవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. కళారంగం వారికి అవకాశాలు దూరం కాగలవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి లబ్ధి. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి. 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అన్ని వ్యవహారాలలోనూ విజయాలు వరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ అభిప్రాయాలను మిత్రులు గౌరవిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. భూములు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందుల బయటపడతారు. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు మరింతగా  పెరుగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు.  కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కొంత ఉపశమనం కలిగించే వార్త అందుతుంది. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలలో కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు, అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. కొత్త పరిచయాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు