ఈ రాశివారికి వారం ప్రారంభంలో మానసిక ఆందోళన

29 Aug, 2021 06:23 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మీ వ్యూహాలు, నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మరింత వెసులుబాటు కలుగుతుంది. చేపట్టిన ఇంటి నిర్మాణాలలో కదలికలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతమే. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ధనవ్యయం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ప్రయత్నలోపం లేకుండా కృషి చేసి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇళ్లు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం కొంత తొలగుతుంది. అయితే కొన్ని అవసరాలకు రుణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు ప్రారంభం నుంచి లాభాల దిశగానే సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరతాయి. సోదరులు, మిత్రుల నుంచి ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై విస్తృతంగా చర్చిస్తారు. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ శ్రమను గుర్తిస్తారు. కళారంగం వారి సేవలకు  గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాÆయి. కొన్నాళ్లుగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలు ఆశించినస్థాయిలో ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ నరసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కుటుంబంలో శుభకార్యాలపై తుది నిర్ణయానికి వస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆస్తులు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో ఇబ్బందులతో కొంత సతమతమైనా దీక్షతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు పూర్తి చేయాలన్న తపనతో శ్రమిస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీగణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు, ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోతాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఆస్తుల వివాదాలు కొంతమేర తీరే సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రేయోభిలాషుల ఆప్యాయత, ఆదరణ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. కళారంగం వారికి అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండి రుణాలు సైతం తీరతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు లేనిపోని వివాదాలు నెలకొనవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు