Weekly Horoscope: వారఫలాలు 20-02-2022 నుంచి 26-02-2022 వరకు

20 Feb, 2022 06:17 IST|Sakshi

మేషం
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, గోధుమ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్న విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకుపచ్చ, ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు రాగలవు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి మాటపడతారు. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి విమర్శలు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.

కన్య
కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. పసుపు, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.

తుల
పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన లేదా సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత జాప్యం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో కష్టానికి ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. నీలం, చాక్లెట్‌ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృశ్చికం
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. తెలుపు, లేత నీలంరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు , సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు సాగుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కలిసివస్తాయి. వివాహయత్నాలు సానుకూలం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనుకోని ఖర్చులు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ పూజలు చేయండి.

మీనం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గతంలో చేజారిన కొన్ని పత్రాలు తిరిగి దక్కుతాయి. ఇంటి నిర్మాణాలలో ముందడుగు వేస్తారు.. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో శ్రమ తప్పదు. కుటుంబంలో సమస్యలు.  చోరభయం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మరిన్ని వార్తలు